మీ దృష్టిలో అత్యుత్తమ తెలుగు సినీ గీతాలు ఏవి? ఇవి నిర్ణయించడానికి మీరు సంగీతసాహిత్యాలు రెంటినీ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఉదాహరణకి, మీరు తెలుగు సినీ సంగీతంతో పరిచయం లేని వారికి వినిపించటానికి ఒకే ఒక గీతం ఎంచుకోవలసివస్తే అది ఏమిటి? అలాగే రెండు గీతాలు ఎంచుకోవలసివస్తే అవి ఏమిటి, మొ.?
నేను ఎంచుకునే మొదటి మూడు పాటలు ఇవీ:
- మల్లీశ్వరి: ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు: ఘంటసాల, భానుమతి: దేవులపల్లి: రాజేశ్వర రావు
- ఉయ్యాల జంపాల: కొండ గాలి తిరిగింది: ఘంటసాల, సుశీల: ఆరుద్ర: పెండ్యాల
- బందిపోటు: ఊహలు గుసగుసలాడే: ఘంటసాల, సుశీల: ఆరుద్ర: ఘంటసాల
పైన మొదటి రెండు గీతాలలో సంగీతసాహిత్యాలకి సమాన స్థానం ఇచ్చాను. మూడో పాటలో సాహిత్యానికంటే సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. వీటినే ఎందుకు ఎంచుకున్నాను అనేది సావకాశంగా మరోసారి!